ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ధర్నా | Woman stages dharna in front of lover's house | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలి ధర్నా

May 5 2015 2:56 PM | Updated on Sep 3 2017 1:29 AM

ఐదేళ్లుగా ప్రేమించి తీరా పెళ్లి అనే సరికి ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలు ధర్నాకు దిగింది.

కొత్తూరు (మహబూబ్‌నగర్ జిల్లా) : ఐదేళ్లుగా ప్రేమించి తీరా పెళ్లి అనే సరికి ముఖం చాటేసిన ప్రియుడి ఇంటి వద్ద ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ సంఘటన మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు మండలం కోడిచర్ల గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. కొత్తూరు మండలంలోని పెంచర్లకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని, అదే మండలం కోడిచర్ల గ్రామానికి చెందిన ఎమ్‌ఎ విద్యార్థి శ్రీనివాస్ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె.. శ్రీనివాస్‌ను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ప్రియుడు ముఖం చాటేశాడు. ఆగ్రహించిన ఆమె.. ప్రియుడి స్వగ్రామం కోడిచర్లలో అతని ఇంటి ఎదుటే ధర్నాకు దిగింది. కాగా విద్యార్థినికి పలువురు నాయకులు మద్ధతుగా నిలిచారు. ప్రేమ పేరుతో మోసం చేసిన శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement