నాలుగేళ్ల ప్రేమ.. న్యాయం కోసం పోరాటం! | woman fights for her love in suryapeta | Sakshi
Sakshi News home page

నాలుగేళ్ల ప్రేమ.. న్యాయం కోసం పోరాటం!

Jul 2 2017 1:40 PM | Updated on Sep 5 2017 3:02 PM

నాలుగేళ్ల ప్రేమ.. న్యాయం కోసం పోరాటం!

నాలుగేళ్ల ప్రేమ.. న్యాయం కోసం పోరాటం!

జిల్లాలో ఓ యువతి న్యాయపోరాటానికి దిగింది.

సూర్యాపేట: జిల్లాలో ఓ యువతి న్యాయపోరాటానికి దిగింది. ఆత్మకూరు(ఎస్‌) మండలం ఎంపీపీ కసాగాని లక్ష్మిబ్రహ్మం కుమారుడు సతీష్, ముల్కలపల్లికి చెందిన యువతి గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే, ఇన్నాళ్లు ప్రేమించిన సతీష్‌ ఇప్పుడు తనను  పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని యువతి ఆందోళనకు దిగింది. ఎంపీపీ ఇంటిముందు బైఠాయించి.. తన న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది.

సతీష్‌ తాను నాలుగేళ్లుగా ప్రేమించుకున్నామని, అతను పెళ్లికి నిరాకరించడంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమె చెప్పింది. అయినా, తనకు న్యాయం జరగకపోవడంతోనే ఎంపీపీ ఇంటిముందు న్యాయపోరాటానికి దిగినట్టు తెలిపింది. ఆమె ధర్నాతో స్పందించిన పోలీసులు ఆమె ప్రియుడు సతీష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement