పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య | Woman committed suicide assaults | Sakshi
Sakshi News home page

పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య

Jan 9 2015 12:18 PM | Updated on Mar 28 2018 11:05 AM

పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య - Sakshi

పోకిరీల వేధింపులతో మహిళ ఆత్మహత్య

ఆకతాయిల ఆగడాలు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్:  రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్లో దారుణం చోటు చేసుకుంది. ఆకతాయిల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఉపాధి కోసం రాజస్థాన్ రాష్ట్రం నుంచి నగరానికి సదరు మహిళ కుటుంబం తరలి వచ్చింది. ఆ క్రమంలో ఆ కుటుంబం ఘట్కేసర్ లో స్థిరపడింది. అయితే ఆ మహిళను గత కొంతకాలంగా ఆకతాయిలు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు.

దాంతో ఆమె తీవ్ర కలత చెంది... శుక్రవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Advertisement
 
Advertisement
Advertisement