తాగడానికే నీళ్లులేవు.. మొక్కలు ఎలా పెంచాలి? | Without Water How to Grow Plants? | Sakshi
Sakshi News home page

తాగడానికే నీళ్లులేవు.. మొక్కలు ఎలా పెంచాలి?

Jul 17 2019 11:45 AM | Updated on Jul 17 2019 11:47 AM

Without Water How to Grow Plants? - Sakshi

మాట్లాడుతున్న ఎంపీపీ

మోత్కూరు : వర్షాభావ పరిస్థితుల్లో గ్రామాల్లో తాగడానికి నీరు దొరకడం లేదని, నర్సరీల్లో మొక్కలు ఎలా పెంచాలని, నాటి వాటిని ఎలా సంరక్షించాలని? పలు గ్రామాల సర్పంచ్‌లు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం మోత్కూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఐదో విడత హరితహారంపై సమీక్ష సమావేశం ఎంపీపీ దీటీ సంధ్యారాణి అధ్యక్షతన జరిగింది. నర్సరీల్లో పెంచడానికి బోర్లు వట్టిపోయాయని, ఎలా పెంచాలని? నాటిన మొక్కలను ఎలా సంరక్షించాలని? దాచారం, పొడిచేడు, అనాజిపురం, రాగిబావి గ్రామాల సర్పంచ్‌లు అండెం రజిత, పేలపూడి మధు, ఉప్పల లక్ష్మమ్మ, రాంపాక నాగయ్య అధికారులను ప్రశ్నించారు. నర్సరీల్లో మొక్కలు పెంచుతున్న వనసేవకులకు ఇప్పటివరకు బిల్లు రాలేదని, వాటిని ఎలా నిర్వహిస్తారని? దాచారం సర్పంచ్‌ అధికారులను ప్రశ్నించారు. ఎంపీపీ దీటీ సంధ్యారాణి మాట్లాడుతూ 7,45,861 మొక్కల లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ఇంటింటికీ మొక్కలు పెంచే విధంగా అధికారులు కృషిచేయాలన్నారు. ఎంపీడీఓ బి.సత్యనారాయణ మాట్లాడుతూ మొక్కల పెంపకంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement