వెల్‌నెస్‌ సెంటర్‌ సిద్ధం

Wellness Center Is Established Khammam - Sakshi

ఖమ్మంవైద్యవిభాగం:  ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, పింఛన్‌దారులకు ప్రయోజనం చేకూర్చేలా..ఎంప్లాయిస్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ స్కీం ద్వారా ఖమ్మంలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వెల్‌నెస్‌ సెంటర్‌ను సిద్ధం చేశారు. దీనిని..సోమవారం ఉదయం 11గంటలకు కలెక్టర్‌ కర్ణన్‌ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఈహెచ్‌ఎస్, జేహెచ్‌ఎస్‌ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15 వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అందులో భాగంగా ఇప్పటి వరకు పలు జిల్లాల్లో 11 ప్రారంభించగా తాజాగా ఖమ్మంలో 12వది సిద్ధమైంది. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యవసర చికిత్సల కోసం ట్రామా కేర్‌ భవనాన్ని ఇందుకు కేటాయించారు. దీనిని నూతనంగా నిర్మించి..ఐదు నెలలు పూర్తయినా వినియోగంలోకి తీసుకురాలేదు. రూ. 7 కోట్ల వ్యయంతో కట్టిన ఈ భవనాన్ని ఇటీవల కలెక్టర్‌ సందర్శనలో పరిశీలించి..ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఇప్పుడు వెల్‌నెస్‌ సెంటర్‌ కోసం ఆ నూతన భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను కేటాయించారు. ప్రత్యేకంగా విభాగాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఉత్వర్వులు జారీ చేశారు.

కలెక్టర్‌ ఆదేశాలతో ఏర్పాట్లు.. 
కలెక్టర్‌ కర్ణన్‌ ఆదేశాలతో ఆరోగ్యశ్రీ జేహెచ్‌ఎస్‌ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు హైదరాబాద్‌ నుంచి వచ్చి మూడు రోజులుగా తిష్ట వేసి..పనులు చేయించారు. ఆస్పత్రికి చెందిన అధికారులు, ఇంజనీరింగ్‌ వారితో మాట్లాడి ట్రామా కేర్‌ భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌ను స్వాధీనం చేసుకుని..వెల్‌నెస్‌ సెంటర్‌కు కావాల్సిన పరికరాలు, సామగ్రిని హైదరాబాద్‌ నుంచి తెప్పించి..ఇక్కడ ఏర్పాటు చేయించారు. 

24 మంది ఉద్యోగులతో సేవలు.. 
వెల్‌నెస్‌ సెంటర్‌లో 24 మంది ఉద్యోగుల ద్వారా వైద్యసేవలు అందించనున్నారు. అందుకోసం ఇటీవల వారి నియామకం చేపట్టారు. ఎంబీబీఎస్‌ డాక్టర్లు 4, బీడీఎస్‌లు 2, ఫిజియోథెరపిస్ట్‌లు 2, ఫార్మాసిస్ట్‌లు 3, జీఎన్‌ఎంలు 3, డెంటిస్ట్‌లు 4, డెంటిస్ట్‌ అసిస్టెంట్లు 2, వార్డుబాయ్‌లు 3, అబ్డామిన్‌ స్కానర్‌ 1, ల్యాబ్‌ టెక్నీషియన్‌ 1 నియమించారు. వెల్‌నెస్‌ సెంటర్‌లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసేవలు అందిస్తారు. ఇక్కడ వైద్యసేవలు పొందాలనుకునేవారు ఎంప్లాయి, జర్నలిస్టు, పెన్షనర్, వారి కుంటుంబ సభ్యులు హెల్త్‌ కార్డును తీసుకొచ్చి వైద్యసేవలు పొందొచ్చు. 

ఓపీ మాత్రమే.. 
నూతనంగా ప్రారంభించనున్న వెల్‌నెస్‌ సెంటర్‌లో ఔట్‌ పేషంట్‌ (ఓపీ) సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ప్రాథమిక వైద్యసేవలు నిర్వహించనున్నారు. రోగులకు వైద్య పరీక్ష చేశాక మందులు ఇస్తారు. త్వరలో స్పెషలిస్ట్‌ డాక్టర్లను కూడా అందుబాటులోకి తేనున్నారు. మెరుగైన వైద్య సేవలు ఇక్కడ అందించనుండగా, అత్యవసర వైద్య సేవల కోసం ఇతర ఆస్పత్రులకు పంపి స్తారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తం గా 250 ఆస్పత్రులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.  ఠీఠీఠీ.్ఛజిట.్ట్ఛ ్చnజ్చn్చ.జౌఠి.జీn వెబ్‌సైట్‌లో ఆ దవాఖానాల వివరాలు, అందుకు సంబంధిచిన పూర్తి సమాచారం ఉంటుంది. ఈహెచ్‌ఎస్‌ ద్వారా 1800 రకాల వైద్య సేవలు అందించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top