
మరుగుదొడ్లను పరిశీలిస్తున్న పీడీ శంకర్
భీమిని : భీమిని, కన్నెపల్లి మండలాల్లోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని డీఆర్‌డీఏ పీడీ శంకర్ సూచించారు. మంగళవారం ఉదయం భీమిని, కన్నెపల్లి మండలాల్లోని రాంపూర్, కన్నెపల్లి గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. బహిరంగ మలవిసర్జన ఉండకూడదని సూచించారు. ఈ నెల 31లోపు గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ గడ్డం మహేశ్వర్‌గౌడ్, ఇన్‌చార్జి ఎంపీడీవో రాధాకృష్ణ తదితరులు ఉన్నారు.