వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితం | Volvo bus accident in mahabubnagar district | Sakshi
Sakshi News home page

వోల్వో బస్సు బోల్తా : ప్రయాణికులు సురక్షితం

Oct 15 2014 10:54 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద బుధవారం వోల్వో బస్సు బోల్తా పడింది.

మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా దన్వాడ మండలం యేలిగండ్ల వద్ద బుధవారం వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు ఎవ్వరు గాయపడలేదు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి బస్సులోని ప్రయాణికులందరిని రక్షించారు. వోల్వో బస్సు బళ్లారి నుంచి హైదరాబాద్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వోల్వో బస్సును రహదారిపై నుంచి పక్కకు తప్పించారు. ప్రయాణికులు మరో బస్సులో తమ తమ గమ్యస్థానాలకు పయనమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement