
సాక్షి, హైదరాబాద్: విజయ పాల ధరను లీటరుకు 75 పైసలు తగ్గిస్తూ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య నిర్ణయించింది. ఈ మేరకు ఆ సమాఖ్య మేనేజింగ్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
అయితే ఈ తగ్గింపు నెలవారీ కార్డులున్న వారికే వర్తింపజేస్తామని వెల్లడించారు. డిస్ట్రిబ్యూటర్ల ద్వారా నెలవారీ కార్డులకు సొమ్ము చెల్లించాలని ఎండీ విజ్ఞప్తి చేశారు.