వాస్తు ‘బాట’లో చంద్రబాబు | Vastu-bitten CM chandrababu eyes | Sakshi
Sakshi News home page

వాస్తు ‘బాట’లో చంద్రబాబు

Jun 30 2015 2:30 AM | Updated on May 29 2018 11:47 AM

వాస్తు ‘బాట’లో చంద్రబాబు - Sakshi

వాస్తు ‘బాట’లో చంద్రబాబు

ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు.

ఓటుకు కోట్లు కేసుతో చిక్కుల్లో పడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటి వాస్తుపై దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా ఆయన తన రాకపోకల దారి మార్చుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 24లోని తన అద్దె నివాసంలోని గేటు నం. 1 నుంచి వారం క్రితం వరకూ రాకపోకలు సాగించేవారు. అయితే ఈ దిశ వాస్తుకు విరుద్ధంగా ఉందని, అందుకే ‘ఓటుకు కోట్లు’లో ఇరుక్కుపోయారని వాస్తు పండితులు చెప్పడంతో వారం రోజుల నుంచి రూటు మార్చారు. గేటు నం. 1 నుంచి కాకుండా ఇప్పుడు గేటు నం. 2 నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.

ఇప్పుడు వాస్తు బాగా కుదిరిందని, వాస్తు దోషాలు పోయాయని పండితులు చెప్పడంతో ఇక నడక కూడా రెండో గేటు నుంచే మొదలు పెట్టారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చాక ఇప్పటివరకూ కుడివైపు తిరిగేవారు. ఇక నుంచి ఎడమ వైపునకు తిరిగి రాకపోకలు సాగించనున్నారు.     - హైదరాబాద్

Advertisement
 
Advertisement
Advertisement