
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) సందర్భంగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చేపట్టిన భద్రత చర్యలు భేష్ అని అమెరికన్ కాన్సుల్ జనరల్ కేథరిన్ బి హడ్డా కితాబిచ్చారు. సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయిన కేథరిన్.. సదస్సు సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అమెరికా ప్రభుత్వం తరఫున ఓవైపు చార్మినార్, మరోవైపు యూఎస్ కాన్సులేట్ జనరల్ ఆఫీస్ ఉన్న మెమెంటోను ప్రదానం చేశారు. భేటీలో శాంతిభద్రతల అదనపు డీజీపీ అంజనీకుమార్, పోలీస్ అకాడమీ డైరెక్టర్ జితేందర్, పీఅండ్‌ఎల్ ఐజీ సంజయ్‌కుమార్ జైన్, కాన్సులేట్ అధికారులు పాల్గొన్నారు.