ఇబ్రహీంపట్నంలో కేంద్రమంత్రి పర్యటన | union minister canvas in ibrahim patnam | Sakshi
Sakshi News home page

ఇబ్రహీంపట్నంలో కేంద్రమంత్రి పర్యటన

Jun 28 2015 7:10 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ఆదివారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ పర్యటించారు.

ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి): ఇబ్రహీంపట్నం నియోజక వర్గంలో ఆదివారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీ పర్యటించారు. తొలిసారిగా  ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి రావడంతో బీజేపీ కార్యకర్తలు, మండల స్థాయి నాయకులు కేంద్రమంత్రిని సత్కరించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్‌లు పర్యటన ముగిసేవరకు కేంద్ర మంత్రి వెంట ఉన్నారు. ఇబ్రహీంపట్నం నియోజక వర్గం ఇన్ చార్జ్ ముత్యాల భాస్కర్ ఆధ్వర్యంలో నేతలు పోరెడ్డి అర్జున్‌రెడ్డి, నర్సింహారెడ్డి, బోసుపల్లి ప్రతాప్, దొండ రమణారెడ్డి తదితరులు కేంద్ర మంత్రిని సత్కరించిన వారిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement