‘ఉపాధి’లో అవినీతి | Under the Employment guarantee scheme corruption Occurred | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’లో అవినీతి

May 20 2015 1:36 AM | Updated on Sep 5 2018 8:24 PM

‘ఉపాధి’లో అవినీతి - Sakshi

‘ఉపాధి’లో అవినీతి

ఉపాధిహామీ పథకం కింద జరిగిన పనుల్లో రూ.2,23,973 అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు...

- కొలతల్లో తేడాతో నిధులు పక్కదారి
- ఓపెన్ ఫోరంలో వెల్లడి
- రికవరీకి ఆదేశాలు
పరకాల :
ఉపాధిహామీ పథకం కింద జరిగిన పనుల్లో రూ.2,23,973 అవినీతి జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో 2014-15లో మండలంలో జరిగిన ఉపాధిహామీ పనులపై బహిరంగ విచారణ(ఓపెన్ ఫోరం) మంగళవారం నిర్వహిం చారు. కార్యక్రమానికి డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌కుమార్, సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ చందు, ప్రిసైడింగ్ అధికారి ైవె .సత్యనారాయణ, ధరంసింగ్ హాజరయ్యూరు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ సభ్యులు.. తాము చే సిన ఆడిట్ వివరాలను గ్రామాలవారీగా చదివి వినిపించారు. మండలంలోని 24 గ్రామాల్లో జరిగిన ఉపాధి పనుల్లో ఎక్కువగా కొలతల్లో తేడాలు వచ్చినట్లు వెల్లడించారు. నాగారం, వెంకటాపూర్ గ్రామాలతోపాటు మరో పది గ్రామాల్లో కొలతల పేరు తో నిధులు కాజేశారని తెలిపారు.

కూలీలకు రూ.1,19,02,515 డబ్బులు చెల్లించగా.. రూ.65లక్షల మెటీరియల్‌ను అందించారు. రూ.2,23,973 నిధులను కాజేసిన వారిలో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఓ, సీఓ, ఈసీల ప్రమే యం ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆ నిధులను రికవరీ చేయడానికి ఆదేశాలు జారీ చేశా రు. అలాగే ముస్త్యాలపల్లిలో భారత్ నిర్మల్ అభియాన్(బీఎన్‌ఏ) పథకంలో పాత మరుగుదొడ్లకేబిల్లులు విడిపించారని తేల్చారు. రూ.92 వే ల నిధులు దుర్వినియోగం అయ్యాయని తెలి పారు. ఉపాధిహామీ కింద అందించిన మొక్క లు ఎండిపోయాయని, వాటిలోనూ అవినీతి జరి గిందని తెలిపారు. అవినీతికి పాల్పడిన వా రి నుంచి నిధులను రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఏపీడీ తెలిపారు. కాగా, కాగా, మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీలో సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బంది పడ్డారు. రాత్రి కావడంతో జనరేటర్ లేక సెల్‌ఫోన్ లైట్ల కింద కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement