తెలంగాణలో వేర్వేరు ఘటనలో సోమవారం ఇద్దరు అన్నదాతలు మృతి చెందారు.
అన్నదాతల మృతి..
Sep 4 2017 12:09 PM | Updated on Oct 1 2018 2:16 PM
సాక్షి, కరీంనగర్/ వర్గల్: తెలంగాణలో వేర్వేరు ఘటనలో సోమవారం ఇద్దరు అన్నదాతలు మృతి చెందారు. అప్పుల బాధతో ఒక రైతు బలవన్మరణం చెందగా మరో రైతు విద్యుదాఘతానికి గురై మరణించాడు. కరీంనగర్‌జిల్లా భీమదేవరపల్లి మండలం బొల్లోనిపల్లి గ్రామానికి చెందిన రైతుకు 2 లక్షల అప్పు అయింది. పంటలు సరిగ్గా పండక అప్పు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
కరెంట్ షాక్‌తో రైతు మృతి..
మెదక్‌జిల్లా వర్గల్ మండలం నాచారంకు చెందిన రైతు పర్సా రమేష్(32) వ్యవసాయ బోర్డు స్విచ్ ఆఫ్ చేస్తుండగా కరెంటు షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. కాగా, సంఘటనా స్థలంలో రమేష్‌ను కాపాడేందుకు యత్నించిన మేనత్త సుభద్రకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Advertisement
Advertisement