మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది.
మండలంలోని గాంధీనగర్ గ్రామంలో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది.
గ్రామానికి చెందిన దోమలపల్లి వెంకటమ్మ కుమారుడు సాయిక్రిష్ణ (14), దోమలపల్లి లింగమ్మ కుమారుడు సందీప్ (12)లు గ్రామానికి సమీపంలోని లయోలా స్కూల్‌లో చదువుతున్నారు. సాయిక్రిష్ణ, సందీప్లు మరో ముగ్గురు స్నేహితులతో కలసి గ్రామ సమీపంలోని నీటి ట్యాంక్‌లో ఈత కొట్టేందుకు వెళ్ళారు. ఎక్కువ సేపు ఈత కొట్టటం వారికి చేతకాకపోవటంతో నీటిలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.