జీపు బోల్తా : ఇద్దరు మృతి | Two killed, 8 injured in jeep accident at Mahabubnagar district | Sakshi
Sakshi News home page

జీపు బోల్తా : ఇద్దరు మృతి

Oct 24 2014 12:05 PM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

మహాబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ మండలం రావులపల్లి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలో ఆస్పత్రికి తరలించారు. మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్నగర్ జిల్లా అస్పత్రికి తరలించారు.  అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement