విద్యుదాఘాతంతో ఇద్దరి పరిస్థితి విషమం | two farmers injured of vidyut shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో ఇద్దరి పరిస్థితి విషమం

Aug 4 2015 4:43 PM | Updated on Aug 25 2018 6:08 PM

ట్రాన్స్ ఫార్మర్ దగ్గర బుష్ వైర్లు వేస్తూ.. ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు.

సదాశివనగర్: ట్రాన్స్ ఫార్మర్ దగ్గర బుష్ వైర్లు వేస్తూ.. ప్రమాదవశాత్తు ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలం గిద్ద గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఒక ట్రాన్స్ ఫార్మర్ దగ్గర బుష్లు వేసేందుకు సంతోష్, శ్రీనివాస్ వెళ్లారు. వీరితో పాటు సబ్స్టేషన్కు చెందిన లైన్మన్ కూడా ఉన్నాడు.

లైన్మన్ సబ్ స్టేషన్కు ఫోన్ చేసి ఎల్సీ ఇవ్వాలని కోరడంతో సబ్స్టేషన్లో విధుల్లో ఉన్న వ్యక్తి సరేనన్నాడు. దీంతో రైతులు ట్రాన్స్ ఫార్మర్కు బుష్ వైర్లు వేసేందుకు ప్రయత్నించారు. కాగా, అదే సమయంలో విద్యుత్ రావడంతో ఇద్దరు రైతులు విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఇద్దరిని వెంటనే నిజామాబాద్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగానే ఉందనీ, ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement