ఈత సరదా ఇద్దరి విద్యార్థుల ప్రాణం తీసింది.
సిరిసిల్ల: ఈత సరదా ఇద్దరి విద్యార్థుల ప్రాణం తీసింది. అప్పటివరకు తమ కళ్లముందే ఆడుకున్న తమ పిల్లలు మధ్యాహ్నం కల్లా విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రుల్లో తీరని విషాదం నింపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
మండలంలోని రామచంద్రపూర్ గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి బొడ్డు విశాల్, మనోజ్‌తో కలిసి పాఠశాల సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈత కొట్టడానికిప్రణీత్, సతీశ్ చెరువులోకి దిగారు. అయితే చెరువులో పొక్లెయిన్‌తో తవ్విన గుంత చాలా లోతుగా ఉండడంతో అందులో మునిగిపోయారు.
కట్టపై ఉన్న మిగతా ఇద్దరు భయంతో కేకలు వేస్తూ సమీపంలోని గ్రామానికి పరిగెత్తుకెళ్లి విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. గ్రామస్తులు చెరువు వద్దకు వచ్చి పరిశీలించగా విద్యార్థులు విగతజీవులుగా కనిపించారు. ప్రణీత్ తల్లిదండ్రులు కనుకవ్వ, బాలయ్య, సతీశ్ తల్లిదండ్రులు రేణుక- శ్రీనివాస్ రోదనలు మిన్నంటాయి.