బాబును మించిన బ్లాక్‌మెయిలర్‌ రేవంత్‌ | trs mla's fired on revanth reddy | Sakshi
Sakshi News home page

బాబును మించిన బ్లాక్‌మెయిలర్‌ రేవంత్‌

Feb 5 2017 3:03 AM | Updated on Sep 5 2017 2:54 AM

టీఆర్‌ఎస్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు శ్రీనివాస్‌ రెడ్డి, పురాణం సతీశ్‌
సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌పై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఇందులో భాగంగా ‘ఏపీ సీఎం చంద్రబాబు కంటే మించిన బ్లాక్‌ మెయిలర్‌ రేవంత్‌’ అంటూ తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పురాణం సతీశ్‌ టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. విపక్షాలన్నీ కలసి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఓ కేసులో కృష్ణ యాదవ్‌ పట్టుబడితే పదవి నుంచి తొలగించారని.. కానీ, ఓటుకు నోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డిని మాత్రం చంద్రబాబు ఏకంగా పార్టీకి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను చేసేశారన్నారు. దీన్ని బట్టి చంద్రబాబును మించిన బ్లాక్‌మెయిలర్‌ రేవంత్‌రెడ్డి అని అర్థమవుతుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement