తిట్లపురాణం

TRS Leader And MPP Cell Phone Audio Viral Karimnagar - Sakshi

‘యూస్‌ లెస్‌ ఫెల్లో.. జాయిన్‌ అయితే ఎంపీపీకి చెప్పాలన్న     జ్ఞానం ఉండదారా.. దొంగ లం.. కొడుకా ఏం రాజకీయం చేద్దామని వచ్చినావురా గంగాధరకు.. ఎంపీపీ పర్మిషన్‌ తీసుకోవారా.. 
పని చేయకున్నా కూర్చుండబెట్టి జీతం ఇచ్చినరా ఇడియట్‌.. పిచ్చిపిచ్చి నకరాలు చేస్తే తన్ని ఎల్లగొడుతా’  .....ఇదంతా గంగాధర ఎంపీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన దూలం బాలాగౌడ్‌.. అధికారి ఎంపీడీవో బండుపై అందుకున్న తిట్లపురాణం. తనకు చెప్పకుండా ఎలా వస్తావని ఇలా కడిగి పారేశారు. చెప్పరాని మాటలు, వినటానికి వీలు లేని బూతులు తిట్టడంతో షాక్‌కు గురైన ఎంపీడీవో బండు ‘సభ్యత సంస్కారంతో మాట్లాడు’ అంటూ మౌనం వహించినా వినలేదు. 

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి.. ఓ మండల స్థాయి అధికారిని ‘బండు’ కడిగాడు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో సోమవారం సాయంత్రం ఓ ఆడియో వైరల్‌ అయ్యింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీపీ, ఎంపీడీవోపై కురిపించిన తిట్ల పురాణానికి సంబంధించిన ఈ ఆడియో సారాంశం కాస్తా వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. అధికారిని రాజకీయ నాయకులు ఇలా కూడా తిడతారా అని జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కాగా.. అధికార పార్టీకి చెందిన మరో ప్రజాప్రతినిధి నోరు పారేసుకోవడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 
 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌/గంగాధర: గతంలోకి వెళ్తే గంగాధర మండల పరిషత్‌ కార్యాలయంలో కొద్ది రోజులు ఈవోపీఆర్డీగా పనిచేసిన బండు ఇక్కడే ఇన్‌చార్జి ఎంపీడీవోగా సైతం విధులు నిర్వహించారు. ఇతనికి ఇదే మండలానికి చెందిన ఎంపీపీ దూలం బాలాగౌడ్‌కు విభేదాలు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం ప్రమోషన్‌పై ఎంపీడీవోగా వేములవాడ మండలానికి వెళ్లారు. గంగాధర మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతోపాటు, విధుల్లో చేరడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వేములవాడ ఎంపీడీవో బండుకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు రోజుల క్రితం విధుల్లో చేరారు. కాగా.. తనకు సమాచారం ఇవ్వకుండా విధుల్లో చేరుతావా అంటూ ఎంపీపీ దూలం బాలాగౌడ్‌ పత్రికల్లో రాయలేని విధంగా దూషించడం చర్చనీయాంశంగా మారింది.

గతంలోనూ ఇబ్బందులకు గురిచేశాడు
గతంలో ఇక్కడ ఈవోపీఆర్డీవోగా, ఇన్‌చార్జి ఎంపీడీవోగా పని చేసినప్పుడు సైతం ఎంపీపీ దూలం బాలాగౌడ్‌ ఇబ్బందులకు గురిచేసాడు. తనకు లాభం అయ్యే పని చేయాలని ఒత్తిడి తెచ్చాడు. అటువంటి సంస్కృతి నాకు లేదు. దీంతో సాలరీలు ఆపాడు. ఎల్‌పీసీ ఆపాడు. ప్రమోషన్‌పై వేములవాడకు ఎంపీడీవోగా వెళ్లాను. నాలుగు రోజుల క్రితం ఇన్‌చార్జి ఎంపీడీవోగా గంగాధరకు వచ్చా. మంగళవారం మూడు గంటల ప్రాంతంలో ఎంపీపీ ఫోన్‌ చేసి ఇష్టం వచ్చినట్లు. అసభ్యకరమైన భాషలో చెప్పరాని విధంగా, రాయలేని విధంగా తిట్టాడు. ఈ విషయాన్ని సీఈవోకు వివరించా. మండలంలో ఏ ఎంపీడీవో పనిచేయడానికి ముందుకు రావడంలేదు. తిట్ల విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. – బండు, ఎంపీడీవో, గంగాధర

సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించా
నేను ఎంపీడీవో విషయంలో మాట్లాడిన దానిలో తప్పేం లేదు. సమాచారం ఇవ్వాలనే విజ్ఞత లేదా అని ప్రశ్నించాను. గతంలో పనిచేసినప్పుడు ఇక్కడ ఇబ్బందులకు గురిచేశారు. మళ్లీ ఇన్‌చార్జిగా వచ్చారు. విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులకు గురిచేయలేదు. నాలుగు రోజుల క్రితం విధుల్లో చేరిన ఎంపీడీవో కనీసం ఎంపీపీకి సమాచారం ఇవ్వాలనే విషయం తెలియదా. జాయినింగ్‌ లెటర్‌పై ఎంపీపీతో అడ్మిట్‌ అని రాయించుకున్న తరువాతే బాధ్యతలు తీసుకోవాలనే నిబంధన ఉంది. విధుల్లో చేరి నాలుగు రోజులైంది. ఫోన్‌ ద్వారానైనా సమాచారం ఇవ్వలేదు. – దూలం బాలాగౌడ్, ఎంపీపీ, గంగాధర

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top