టేకాఫ్ దశలోనే ఉన్నాం: ఈటెల | TRS Government now Take off stage, says etela rajender | Sakshi
Sakshi News home page

టేకాఫ్ దశలోనే ఉన్నాం: ఈటెల

Jan 7 2015 5:46 PM | Updated on Sep 2 2017 7:21 PM

టేకాఫ్ దశలోనే ఉన్నాం: ఈటెల

టేకాఫ్ దశలోనే ఉన్నాం: ఈటెల

టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్నవి పసలేని ఆరోపణలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై విపక్షాలు చేస్తున్నవి పసలేని ఆరోపణలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌర సరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో బుధవారం ఆయన 'సాక్షి'తో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలన వేగాన్ని ఓర్వలేక, రాజకీయ మనుగడ కోసం తమ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. తమ సర్కారు ప్రస్తుతం టేకాఫ్ దశలోనే ఉందన్నారు. రానున్న రోజుల్లో మరింతగా ప్రజా విశ్వాసం పొందుతామని ఈటెల ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం సరఫరా పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు ఉన్నమాట వాస్తమని, రానున్న రోజుల్లో అన్నింటినీ అధిగమిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. తాము చెబుతున్న ప్రతి పనినీ చేసి చూపిస్తామన్నారు.  ప్రస్తుత పరిణామాలు బేరీజు వేసుకుని వచ్చే ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్తాయి బడ్జెట్ ను రూపొందిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement