టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ: సైదిరెడ్డి  | TRS Candidate Shanampudi Saidireddy Campaign In Nereducherla | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే బంగారు తెలంగాణ: సైదిరెడ్డి 

Dec 6 2018 11:08 AM | Updated on Dec 6 2018 11:08 AM

TRS Candidate Shanampudi Saidireddy Campaign In Nereducherla - Sakshi

దాసారంలో మాట్లాడుతున్న శానంపూడి సైదిరెడ్డి

సాక్షి, నేరేడుచర్ల : టీఆర్‌ఎస్‌ పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యమని హుజూర్‌నగర్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలోని దాసారం, బూర్గులతండా, బొడలదిన్నె, చింతకుంట్ల, చిల్లేపల్లి, రామగిరి, ముసిఒడ్డుతండా, రామకృష్ణాతండా, పులగంబండ తండా, జగన్నాథతండా, ముత్యాలమ్మకుంటలలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు 24గంటల విద్యుత్‌ సౌకర్యం, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదిముభారక్‌ వంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులు చేపడుతుందన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే సాగర్‌ నీరు రాకుండా అడ్డుపడడంతో పాటు విద్యుత్‌ కూడా సక్రమంగా రానివ్వరన్నారు. హుజూర్‌నగర్‌ కోటలో గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. యువత, మహిళలు, రైతుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రమావత్‌ గీత రాంచందర్, ఎంపీటీసీలు గొడేటి వెంకన్న, నిర్మల రవీందర్, విజయలక్ష్మి, కిరణ్, మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, మార్కెట్‌ డైరెక్టర్‌ మందడి ముత్యంరెడ్డి, మాజీ సర్పంచ్‌ సిరికొండ సరిత, కోటిరెడ్డి, శ్రీనివాస్, శంకర్, వల్లపురెడ్డి, సాయమ్మ, వెంకటేశ్వర్లు, భిక్షం, శ్రీనునాయక్, గోవింద్‌ నాయక్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement