‘కార్పొరేషన్‌’ బరిలో ట్రాన్స్‌జెండర్‌

Transgender Nomination in Nizamabad Corporation Elections - Sakshi

నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొదటి సారిగా ట్రాన్స్‌జెండర్‌ బరిలోకి దిగారు. నగరంలోని 16వ డివిజన్‌ అభ్యర్థిగా తెలంగాణ ట్రాన్స్‌జెండర్‌ సమితి నాయకులు జరీనా శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరీనా మాట్లాడుతూ, తనను గెలిపిస్తే నిస్వార్ధంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్స్‌ సమితి కార్యదర్శి గంగ, ఉపాధ్యక్షులు అలక, అక్షర, మాధురి, శ్యామల, లత తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top