తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వెబ్‌సైట్‌ను అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం ప్రారంభించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వెబ్‌సైట్‌ను అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య శనివారం ప్రారంభించారు. డిసెంబర్ 31లోగా సభ్యత్వ నమోదును పూర్తిచేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న టీపీసీసీ ఇకపై ఆన్‌లైన్‌లోనూ ఇది అందుబాటులో ఉంటుందని పొన్నాల చెప్పారు. దేశ,విదేశాల్లో ఉన్న వారికి,ఉద్యోగాలు, ఇతర వ్యాపకాల్లో ఉండేవారికి ఆన్‌లైన్ మెంబర్‌షిప్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఆదివారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో సభ్యత్వనమోదుపై సమీక్ష, మైనారిటీల సమ్మేళనం, రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, తదితర అంశాలపై చర్చించేందుకు రాష్ర్టపార్టీ సమన్వయకమిటీ సమావేశం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.