
హైదరాబాద్‌లో ప్రయాణించే దేశీయ, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకు సులభమైన, వేగవంతమైన సౌకర్యవంతమైన బుకింగ్ అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా.. ఈడెన్ హోమ్‌స్టే కంపెనీ ఆన్‌లైన్ బుకింగ్ వెబ్‌సైట్ ప్రారంభించింది. ఇది మొబైల్, టాబ్లెట్, డెస్క్‌టాప్‌లలో కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది. పర్యాటకులు ఈ వెబ్‌సైట్ ద్వారా గదుల లభ్యతతో పాటు, లేటెస్ట్ ఫోటోలను బ్రౌజ్ చేస్తూ.. వివరణాత్మక సమాచారం పొందవచ్చు. అంతే కాకుండా వేగంగా బుకింగ్స్ పూర్తి చేసుకోవచ్చు.
ముఖ్యమైన ఫీచర్లు..
➢రియల్-టైమ్ బుకింగ్ సిస్టమ్: తక్షణ ధృవీకరణ
➢మల్టీ-కరెన్సీ సపోర్ట్: విదేశీ అతిథుల కోసం
➢స్పష్టమైన ధరల సమాచారం: దేశీయ & అంతర్జాతీయ అతిథుల కోసం
➢రివార్డ్ పాయింట్స్ సిస్టమ్: తదుపరి బుకింగ్లో ఉపయోగించుకోడానికి
➢గిఫ్ట్ కార్డ్స్: కొనుగోలు, రీడెంప్షన్ కోసం
➢ఇంటిగ్రేటెడ్ గూగుల్ మ్యాప్స్: సులభ నావిగేషన్ కోసం
➢ఆథెంటిక్ గెస్ట్ రివ్యూలు: సరైన నిర్ణయం తీసుకోవడానికి
➢256-బిట్ ఎన్‌క్రిప్షన్‌తో సెక్యూర్ పేమెంట్స్
➢మల్టీ-లాంగ్వేజ్ సపోర్ట్: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం
ప్రాపర్టీ ఓనర్లకు కొత్తఅవకాశాలు
హైదరాబాద్‌లో పాటు భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా స్థానిక పర్యాటకాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కంపెనీ ఈ వెబ్‌సైట్ తీర్చిదిద్దింది. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా హోస్ట్ తమ స్టేలను లిస్ట్ చేసుకోవచ్చు. దీని ద్వారా స్థానికంగా ఉపాధిఅవకాశాలు మెరుగుపడతాయి.
దీని గురించి ఈడెన్ హోమ్‌స్టే ప్రతినిధి మాట్లాడుతూ.. స్టేలో లభించే సౌకర్యం, ఆత్మీయతలాగే బుకింగ్ అనుభవం కూడా సులభంగా, సౌకర్యవంతంగా ఉండాలని మేము కోరుకున్నాము. ఈ అప్‌గ్రేడ్ మా అతిథులందరికీ నాణ్యత, ఆత్మీయత, సౌలభ్యం అందించాలన్నదే ప్రధాన ఉద్దేశం అని అన్నారు.