కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామానికి చెందిన ఆకుల రాములు(45) అనే గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందినట్లు ఎస్సై తిరుమల్‌గౌడ్ తెలిపారు.
సుల్తానాబాద్ (కరీంనగర్) : కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల గ్రామానికి చెందిన ఆకుల రాములు(45) అనే గీత కార్మికుడు తాటిచెట్టుపై నుంచి పడి మృతిచెందినట్లు ఎస్సై తిరుమల్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం చెట్టు నంచి కల్లు తీసి దిగుతుండగా మోకుజారడంతో ఒక్కసారిగా వెనుకవైపుకు కిందపడ్డాడు.
స్థానికులు, గీతకార్మికులు గమనించి హుటాహుటిన ప్రైవేట్ వాహనంలో కరీంనగర్ తరలించారు. అయినప్పటికీ చికిత్స ప్రారంభం కాగానే అతను మృతిచెందినట్లు తెలిపారు. మృతునికి భార్య సారమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఇద్దరు వికలాంగులు ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.