నేడు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల విలీనం | Today, the primary teacher unions to merge | Sakshi
Sakshi News home page

నేడు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల విలీనం

Dec 5 2014 4:40 AM | Updated on Sep 2 2017 5:37 PM

వివాదాలు, కోర్టు కేసులు, ఆధిపత్య పోరు మూలంగా పదేళ్ల క్రితం విడిపోయిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలను మళ్లీ ఏకం చేసి కొత్త సంఘా న్ని ఏర్పాటు ....

సాక్షి, హైదరాబాద్: వివాదాలు, కోర్టు కేసులు, ఆధిపత్య పోరు మూలంగా పదేళ్ల క్రితం విడిపోయిన ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాలను మళ్లీ ఏకం చేసి కొత్త సంఘా న్ని ఏర్పాటు చేస్తున్నామని రెండు గ్రూపుల నేతలు టి.వై.ఎస్. శర్మ, టి.సాయిబాబ, షౌకత్ అలీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంఘాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘాన్ని(టీఎస్‌పీటీఏ) ఏర్పాటు చేస్తున్నామన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ని ఎస్‌సీఈఆర్‌టీలో సమావేశమై సంఘాల విలీనంతో పాటు టీఎస్‌పీటీఏ కొత్తకార్యవర్గాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement