నేడు గవర్నర్ రాక | Today, the arrival of the Governor | Sakshi
Sakshi News home page

నేడు గవర్నర్ రాక

Mar 24 2015 12:24 AM | Updated on Mar 21 2019 8:30 PM

నేడు గవర్నర్ రాక - Sakshi

నేడు గవర్నర్ రాక

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ర్ట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ మంగళవారం జిల్లాకు రానున్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ర్ట గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్ మంగళవారం జిల్లాకు రానున్నారు. జిల్లాలోని ప్రధాన ఆలయాలను సందర్శిస్తారు. కాకతీయ మిషన్ పనులను పరిశీలిస్తారు. బుధవారం ఉదయం హైదరాబాద్ వెళ్తారు.. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటించే ఖిలా వరంగల్, రామప్ప ఆలయాల్లో ఏర్పాట్లను    కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా  పరిశీలించారు. - వెంకటాపురం/ఖిలా వరంగల్  
 
వెంకటాపురం/ఖిలావరంగల్ : చారిత్రక రామప్ప దేవాలయం, ఖిలావరంగల కోటలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లను కలెక్టర్ వాకాటి కరుణ సోమవారం  పరిశీలించారు.  ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ, క మిషనర్ సర్పరాజ్ అహ్మద్ తదితరులతో కలెక్టర్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కోటలో కాకతీయు వైభవాన్ని వివరించే సౌండ్ లైటింగ్ షోను తిలకించారు. తహసీల్దార్ రవి, నగర డీఎస్పీ సురేంద్రనాధ్, సీఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం రామప్పలో చేపట్టబోయే ఏర్పాట్లను పరిశీలించారు. రామప్ప ఆలయ ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రపరచాలని పురావస్తుశాఖ సిబ్బందికి సూచించారు. అనంతరం రామప్ప సరస్సు కట్టకు చేరుకుని హరిత హోటల్‌ను పరిశీలించారు. కట్ట నుంచి హోటల్ వరకు ఇరువైపుల ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట దేవాదాయ శాఖ ఆసిస్టెంట్ కమిషనర్ సాయిబాబా, ములుగు ఆర్డీఓ చీమలపాటి మహేందర్‌జీ, ములుగు డీఎస్పీ రాజమహేంద్రనాయక్, సీఐ శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ మర్కాల రజని, ఎంపీడీఓ రాధిక, ఈజీఎస్ ఎపీఓ నారగోని సునీత, వెంకటాపురం ఎస్సై భూక్య రవికుమార్, స్థానిక సర్పంచ్ కారుపోతుల పూలమ్మ ఉన్నారు.

రామలింగేశ్వరస్వామికి పూజలు

రామప్పలోని రామలింగేశ్వరస్వామికి కలెక్టర్ వాకాటి కరుణ, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝూ సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ చిందం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధాన పూజారి కోమల్లపల్లి హరీష్‌శర్మ వారిని శాలువాలతో సత్కరించారు. అనంతరం టూరిజం గైడ్ గోరంట్ల విజయ్‌కుమార్‌చే ఆలయ శిల్పకళాసంపద గురించి అడిగి తెలుసుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement