విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి | To the development of education | Sakshi
Sakshi News home page

విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి

Oct 23 2014 12:36 AM | Updated on Jul 11 2019 5:01 PM

తెలంగాణలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం: తెలంగాణలో విద్యారంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్ అన్నారు. బుధవారం సుందర య్య విజ్ఞాన కేంద్రంలో ‘వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్స్’ టీఎస్‌యూటీఎఫ్ అధికార మాసపత్రిక తొలి సంచికను ఆవిష్కరించిన సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు మండలిలో మాట్లాడేం దుకు తగిన సమయాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చా రు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులను ప్రైవేటు పాఠశాలల వారు తీసుకుపోతున్నార ని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ డాక్టర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ ఉపాధ్యాయ అంశాలతోపాటు సామాజిక, ఆర్థిక, రాజకీ య అంశాలన్నింటిని విశ్లేషిస్తూ ఈ పత్రిక మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు ఎ.నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి, టీడీటీఎఫ్ అధ్యక్షులు కె.నారాయణరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement