
భువనగిరి అర్బన్: టైరు పేలడంతో డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఓ టిప్పర్ లారీ బ్రిడ్జి దిమ్మెలపై నిలిచిపోయిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ఫ్లై ఓవర్‌పై మంగళవారం చోటుచేసుకుంది. బొమ్మలరామారం నుంచి ఆత్మకూర్‌కు కంకర లోడ్‌తో టిప్పర్ లారీ వెళ్తుంది.
రాయగిరి గ్రామంలో ఉన్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదకు రాగానే ముందు టైరు పేలడంతో డివైడర్‌ను, విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి బ్రిడ్జి చివరి భాగంలో వేలాడుతూ నిలిచిపోయింది. టైర్లు విడిపోయి బ్రిడ్జి కిందకు వేలాడుతున్నాయి. లారీ డ్రైవర్ గణేశ్, క్లీనర్ బాలరాజ్‌కు స్వల్ప గాయాలవ్వడంతో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.