
ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్ బెజ్జూర్ ప్రధాన రహదారిలో కొండపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం పులి రోడ్డు మీదకు రావడంతో ప్రయాణికులు హడలిపోయారు. బెజ్జూర్ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు పులి అడ్డురావడంతో అందులో ఉన్న విద్యార్థులు సెల్‌ఫోన్‌లో ఫొటోలను తీశారు. పులి సంచరిస్తుండటంతో పెంచికల్‌పేట్ నుంచి సలుగుపల్లి, బెజ్జూర్‌వెళ్లే ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. – పెంచికల్‌పేట్ (సిర్పూర్)