మద్యం మత్తులో ఉన్న ముగ్గురు జైళ్ల శాఖ ఉద్యోగులపై వేటు పడింది.
మద్యం మత్తులో ఉన్న ముగ్గురు జైళ్ల శాఖ ఉద్యోగులపై వేటు పడింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సబ్‌జైలును జైళ్ల శాఖ జిల్లాసూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా వార్డెన్ మోహన్‌దాస్, హెడ్ వార్డెన్ సయ్యద్ అఫ్జల్, కానిస్టేబుల్ వైవీ రమణలు మద్యం మత్తులో ఉన్నట్టు గుర్తించిన ఆయన పరీక్షలకు ఆదేశించారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో మద్యం సేవించినట్టు బయటపడడంతో వారిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.