పాము కోసం ఇంటినే కూలగొట్టారు ఓ దంపతులు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ముల్కపల్లికి చెందిన గుండెబోయిన చంద్రయ్య, మంజుల దంపతులది పెంకుటిల్లు.
పాము కోసం ఇంటినే కూలగొట్టారు ఓ దంపతులు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి మండలం ముల్కపల్లికి చెందిన గుండెబోయిన చంద్రయ్య, మంజుల దంపతులది పెంకుటిల్లు. ఇంట్లోకి కొంతకాలం క్రితం నాగుపాము వచ్చి చేరింది. ఇంటి చూరులోని ఎలుకలను తింటూ అక్కడే తిష్టవేసింది. అప్పుడప్పుడు దూలాల మీద తిరుగుతూ కనపడటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చిన్న అలికిడి అయితే చాలు ప్రాణభయంతో వణికిపోయేవారు.
ఆ పాముతో విసిగిపోయిన దంపతులు తమ ఇంటిని కూల్చివేశారు. పై కప్పు దూలాలన్నీ తీసివేయడంతో నాగుపాముకు ఆహారం లేకుండా పోయింది. రాత్రి గోడమీద నుంచి పాము కింద పడడంతో వెంటనే దానిని చంపేశారు. అప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఓ పాము కోసం ఇల్లు మొత్తాన్ని కూల్చుకోవాల్సి వచ్చింది.