మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఓ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది.
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఓ ఇంట్లో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. మోర్తల సైదురెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడి 16 తులాల బంగారు ఆభరణాలు, ఒక కేజి 700 గ్రాముల వెండి, రూ 9000 నగదు దొంగిలించారు. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ భిక్షపతి పరిశీలించారు.