స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో సోమేశ్(22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో సోమేశ్(22) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రాత్రే ఆత్మహత్య చేసుకున్నా మంగళవారం ఉదయం వరకూ ఎవరికీ తెలియలేదు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.