హోంగార్డుల వేతనం పెంపు | The wage hike hongardu | Sakshi
Sakshi News home page

హోంగార్డుల వేతనం పెంపు

Jan 20 2016 4:37 AM | Updated on Sep 3 2017 3:55 PM

హోంగార్డుల గౌరవ వేతనాన్ని రోజుకు రూ.400కు పెంచుతున్నామని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని ...........

ఏప్రిల్ 1 నుంచి రూ.400
చేస్తున్నట్లు హోంమంత్రి ప్రకటన

 అల్లిపురం(విశాఖ): హోంగార్డుల గౌరవ వేతనాన్ని రోజుకు రూ.400కు పెంచుతున్నామని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి దీన్ని అమలు చేస్తామని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఆయన నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న హోంగార్డులు వేతనాల ఫైలుపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారన్నారు. అనంతరం విపత్తుల నివారణ బృందానికి అవసరమైన పనిముట్లను అందజేశారు. శాంతి భద్రతలు, నేరాల నియంత్రణపై తీసుకుంటున్న చర్యలపై సంబంధిత ఏసీపీలు, ఎస్.హెచ్.ఓలతో సమీక్షించారు. ఫ్లీట్ రివ్యూ సందర్భంగా నగరంలో శాంతిభద్రతల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement