ఇద్దరు సీఎంలూ దోషులే: ఉత్తమ్ | The two chief convicted: Uttam | Sakshi
Sakshi News home page

ఇద్దరు సీఎంలూ దోషులే: ఉత్తమ్

Jun 19 2015 4:43 AM | Updated on Sep 19 2019 8:44 PM

ఇద్దరు సీఎంలూ దోషులే: ఉత్తమ్ - Sakshi

ఇద్దరు సీఎంలూ దోషులే: ఉత్తమ్

పార్టీ ఫిరాయింపులకు ఆధ్యులు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పార్టీ ఫిరాయింపులకు ఆధ్యులు ఆంధ్ర, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు.  నిజామాబాద్‌లో గురువారం ఏర్పా టు చేసిన ఎమ్మెల్సీ ఆకుల లలిత సన్మానసభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. అంతకు ముందు కామారెడ్డి, నిజామాబాద్‌ల్లో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఏడాది పాల నపై జనం అసంతృప్తితో ఉన్నారన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కిన చంద్రబాబు, రేవంత్‌తోపాటు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌ను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.  
 
బాబే  ముద్దాయి: వీహెచ్
నోటుకు కోట్లు కేసులో చంద్రబాబే అసలు ముద్దాయని రాజసభ సభ్యుడు వి.హన్మంతరావు అన్నా రు. టేపులో గొంతు తనదికాదని అంటున్న చం ద్రబాబు ఢిల్లీలో పైరవీలు ఎందుకు చేస్తున్నా రని ప్రశ్నించారు. లలితను ఆశీర్వదించే సభకు డి.ఎస్. హాజరు కాకపోవడం మంచిది కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement