కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1813 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భారీగా ఆదాయం కోల్పోయిన తెలంగాణ ప్రభుత్వానికి కొంత ఊర ట లభించింది. డిసెంబర్‌కు సంబంధించి పన్నుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం రూ.1813 కోట్లు విడుదల చేసింది. గత నెలలో రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో కేంద్రం భారీగా కోత పెట్టిన విషయం తెలిసిందే. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్రం, తమ పన్నుల వాటాలో 42 శాతం పంపిణీ చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ప్రతి నెలా సగటున రూ.997 కోట్లు పన్నుల వాటా కింద కేటారుుస్తుంది. ప్రతి నెల ఒకటో తారీఖున ఈ డబ్బు రాష్ట్ర ఖజానాలో జమవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు నిర్ణీత వాటాను విడుదల చేసిన కేంద్రం, అనూహ్యంగా నవంబర్‌లో భారీగా నిధుల కోత పెట్టింది.
కేవలం రూ.450 కోట్లు విడుదల చేసి మిగతా రూ. 547 కోట్లు కోత విధించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్రంగానే స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్నుల వాటాలో కోత పెట్టిన విషయాన్ని ఆయన ఇటీ వల ఢిల్లీకి వెళ్లిన సంద ర్భంలో ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కేంద్రం పన్ను ల వాటా చెల్లింపులను సవరించింది. సగటున రావాల్సిన నిధులతో పోలిస్తే అదనంగా రూ.816 కోట్లు విడుదల చేసింది. ఈ నెలలో మొత్తం రూ.1813 కోట్లు కేటా రుుంచింది. ముందుగా ఏప్రిల్, మే, జూన్‌లో వచ్చిన పన్నుల ఆదాయాన్ని లెక్క గట్టి కోత పెట్టిన కేంద్రం.. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల ఆదాయాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని పన్నుల వాటా విడుదల చేసినట్లు అధికార వర్గా లు చెబుతున్నారుు. దీంతో నవంబర్‌లో కోత పెట్టిన రూ.547కోట్లు సర్దుబాటు కాగా,అదనంగా రూ.269కోట్లు రాష్ట్రానికి చెల్లించినట్లు స్పష్టమవుతోంది.
రూ.450 కోట్ల నాబార్డ్ రుణం
రాష్ట్రానికి రూ.450 కోట్ల నాబార్డ్ రుణం మంజూరైంది. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ బెనిఫిట్ ప్రోగ్రామ్‌కు ఈ నిధు లు కేటారుుంచింది. మరోవైపు హెచ్‌ఎం డీఏ పరిధిలో వాటర్ వర్క్స్‌కు హడ్కో నుంచి తీసుకున్న రుణానికి సంబంధిం చిన వడ్డీ చెల్లింపులకు ఆర్థిక శాఖ రూ.142కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పన్నుల వాటా సర్దుబాటు
Published Sat, Dec 3 2016 3:26 AM | Last Updated on Tue, Oct 2 2018 4:36 PM
Advertisement