హరితహారంలో గులాబీ దళం | The pink squad in the harithaharam program | Sakshi
Sakshi News home page

హరితహారంలో గులాబీ దళం

Jul 8 2017 2:07 AM | Updated on Aug 15 2018 9:40 PM

హరితహారంలో గులాబీ దళం - Sakshi

హరితహారంలో గులాబీ దళం

‘మీ ఇళ్ల ముందు నాటే మొక్కలే కాదు.. గ్రామంలో నాటే మొక్కల సంరక్షణ బాధ్యతా మీరే తీసుకోవాలి.

► వార్డు సభ్యుడి నుంచి మంత్రి దాకా బాధ్యత తీసుకోవాలి
► పార్టీ నేతలకు కేసీఆర్‌ ఆదేశం


సాక్షి, హైదరాబాద్‌: ‘మీ ఇళ్ల ముందు నాటే మొక్కలే కాదు.. గ్రామంలో నాటే మొక్కల సంరక్షణ బాధ్యతా మీరే తీసుకోవాలి. పార్టీ శ్రేణులు, అధికారిక పదవుల్లో ఉన్న వారు, పంచాయతీ వార్డు సభ్యుడి నుంచి మంత్రుల దాకా హరిత హారం కార్యక్రమాన్ని కీలకంగా భావించాలి. వర్షాలు ఉన్నప్పుడే విస్తృతంగా మొక్కలు నాటాలి. ఇది నా కోసం కాదు. మన భవిష్యత్‌ తరాల కోసం..’ అని సీఎం కేసీఆర్‌ టీఆర్‌ ఎస్‌ నేతలకు ఉద్బోధిం చారు. ఈ నెల 12 నుంచి మొదలు కానున్న 3వ విడత హరితహారం కార్య క్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ శ్రేణులను భాగస్వామ్యం చేయాలని సీఎం నిర్ణయించారు.

గత రెండు, మూడు రోజులుగా తనను కలుస్తున్న పలువురు నాయకులకు ఈ మేరకు కేసీఆర్‌ సూచిస్తున్నారు. గ్రామ స్థాయి కార్యకర్తల వరకు ఈ స్ఫూర్తిని తీసుకువెళ్లాలని సీఎం కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మూడో విడత హరితహారాన్ని సీఎం కేసీఆర్‌ కరీంనగర్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో మొక్కల సంరక్షణపై టీఆర్‌ఎస్‌ శ్రేణులకు ఆదేశాలు వెళ్లాయంటున్నారు. ఈసారి ఆశించి న స్థాయిలోనే వర్షాలు కురుస్తున్నందున అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తాను ఇంతగా ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో వాలని కేసీఆర్‌ పార్టీ నేతలతో వ్యాఖ్యానిం చినట్లు తెలిసింది. ఇప్పటికే రెండు పర్యాయా లు జరిగిన హరితహారంలో పాల్గొన్న అనుభ వం ఉన్నందున, మూడో విడత కోసం పార్టీ యంత్రాంగం ఏ మేరకు ఏర్పాట్లు చేసుకుందో కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement