‘మిషన్‌కాకతీయ’ చెరువుల్లో ప్రైవేటు సర్వే | "The mission of the Kakatiya 'private survey of ponds | Sakshi
Sakshi News home page

‘మిషన్‌కాకతీయ’ చెరువుల్లో ప్రైవేటు సర్వే

Jun 5 2016 2:53 AM | Updated on Aug 10 2018 8:16 PM

‘మిషన్‌కాకతీయ’ చెరువుల్లో ప్రైవేటు సర్వే - Sakshi

‘మిషన్‌కాకతీయ’ చెరువుల్లో ప్రైవేటు సర్వే

జిల్లాలో మిషన్‌కాకతీయ అక్రమాలను బయటపెట్టేం దుకు ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు....

టీడీపీ జిల్లాధ్యక్షుడు విజయరమణారావు

పెద్దపల్లి : జిల్లాలో మిషన్‌కాకతీయ అక్రమాలను బయటపెట్టేం దుకు ప్రైవేటు వ్యక్తులతో సర్వే చేయిస్తామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామంలోని మల్లారెడ్డికుంటను శనివారం పార్టీ శ్రేణులతో కలిసి సందర్శించారు. జిల్లాలో చేపడుతున్న చెరువుల అభివృద్ధి పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయని, ఇందులో పెద్దపల్లి ముందువరసలో ఉందని పేర్కొన్నారు. మల్లారెడ్డి చెరువులోని మట్టిని టీఆర్‌ఎస్ నాయకులు ఇటుకబట్టీలకు అమ్ముకున్నారని, అధికారులతో కుమ్మక్కై బిల్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టంచేశారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఇటుకబట్టీలకు మట్టి తరలింపు దందా కొనసాగుతోందన్నారు.  

 విజయ్‌తో రైతుల వాగ్వివాదం
మల్లారెడ్డి చెరువు వద్దకు విజయరమణారావు వెళ్లిన విషయం తెలుసుకున్న సర్పంచ్ రాంమూర్తి రైతులతో కలిసి చెరువుకు చేరుకున్నారు. మట్టి ఎవరు తీసుకెళ్లినా తమకు అభ్యంతరం లేదని, చెరువు లోతు కావాలని కోరుకుంటున్నామని రైతులు తెలిపారు. రాజకీయం చేసి చెరువు అభివృద్ధిని అడ్డుకోవద్దని సూచించారు. చెరువు పరిశీలనకు వచ్చిన సీపీఐ నాయకుడు తాండ్ర సదానందంతో గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు. యువకులు రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకునేవరకూ వెళ్లారు. ఎస్సైలు రాజ్‌కుమార్, రవికుమార్ చెరువు వద్దకు చేరుకుని సముదారుుంచారు. విజయరమణారావు వెంట పార్టీ నాయకులు ఉప్పు రాజు, ఎడెల్లి శంకర్, అక్కపాక తిరుపతి, సాయిరి మహేందర్, కిషోర్, రంగు శ్రీనివాస్, రాజు, గంట రాములు పలువురున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement