‘మిషన్ కాకతీయ’ పనుల్లో వేగం పెంచాలి | "The mission of the Kakatiya 'increase the speed of work | Sakshi
Sakshi News home page

‘మిషన్ కాకతీయ’ పనుల్లో వేగం పెంచాలి

Jun 9 2016 9:30 AM | Updated on Nov 9 2018 5:56 PM

‘మిషన్ కాకతీయ’ పనుల్లో వేగం పెంచాలి - Sakshi

‘మిషన్ కాకతీయ’ పనుల్లో వేగం పెంచాలి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర

నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు

మహబూబ్‌నగర్ న్యూటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పనులలో వేగం పెంచాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా మొదటి, రెండవ విడత పురోగతిని అడిగి తెలుసుకున్నారు. మొదటి విడతలో మంజూరైన పనులను పూర్తి చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తగదన్నారు.ఈ నెలాఖరులోగా అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.

మొదటి విడతలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుపై వివరాలు తెలుసుకున్నారు. పనులు పూర్తి చేయడంలో కాంట్రాక్టర్ల తీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు. మొదటి విడత పనులు వెంటనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ వీసికి డిప్యూటీ ఎస్‌ఈ ఆనంద్‌సాగర్, మహబూబ్‌నగర్ ఈఈ నర్సింగ్‌రావు, డిఈఈ అశోక్‌కుమార్‌తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement