ఆదాయ పన్ను దాఖలుకు చివరి తేదీ కావడంతో శనివారం ఐటీ కార్యాలయాలు పని చేయనున్నాయి.
ఆదాయ పన్ను శాఖ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఆదాయ పన్ను దాఖలుకు చివరి తేదీ కావడంతో శనివారం ఐటీ కార్యాలయాలు పని చేయనున్నాయి. ఐటీ దాఖలు వివరాల సమర్పణలో కలిగే ఇబ్బందులను పరిష్కరించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఆదేశాల మేరకు శనివారం వరకు ఐటీ కార్యాలయాలు పని చేస్తాయని ఆదాయ పన్ను శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.