నిజాయితీతో స్వచ్ఛమైన పాలన అందించి, ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
బల్మూర్: నిజాయితీతో స్వచ్ఛమైన పాలన అందించి, ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని బంగారుమయంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఆదివారం బల్మూరు మండలంలోని మంగళకుంటపల్లిలో ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజ్‌తో కలిసి టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోను ముఖ్యమంత్రి పవిత్ర గ్రంథంగా భావిస్తూ అందులో పొందుపరిచిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి టీఆర్‌ఎస్ పార్టీలో సభ్యత్వం తీసుకుంటున్నారని చెప్పారు.
గతంలో నియోజకవర్గంలో ఏపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టినా 10వేలకు మించేది కాదని, ప్రస్తుతం టీఆర్‌ఎస్ సభ్యత్వాలు ప్రతి నియోజకవర్గంలో 60వేలు కానున్నాయని చె ప్పారు. 65ఏళ్ల పాలనలో అన్నిరకాలుగా వివక్షకు గురై అభివృద్ధికి నోచుకోని తెలంగాణ కేసీఆర్ పాలనతో ఏడు మాసాల్లోనే అభివృద్ధి దిశగా రూపు దిద్దుకుంటుందన్నారు. నాలుగేళ్లలో ఇంటింటికి తాగునీరందించకుంటే ఎన్నికల్లో ఓట్లే అడగమని సీఎం ప్రకటించారని, చెప్పిన ప్రతి మాటను ఆచరణలో రూపుదాల్చడమే దిద్దడమే ధ్యేయమన్నారు. అనంతరం మంత్రి చేతుల మీదుగా గ్రామంలోని పలువురికి టీఆర్‌ఎస్ సభ్యత్వా నమోదు పత్రాలను అందించారు. కార్యక్రమంలో నాయకులు పోకల మనోహర్, వెంకట్‌రెడ్డి, రాంమోహన్‌రావు, వంగబాల్ నారాయణగౌడ్, గోపాల్‌రావు, కొండల్‌రావు, గురుగౌడ్, నాగేశ్వర్‌రావు, తిరుపతయ్య, పాల్గొన్నారు.