నీటి తొట్టిలో పడి బాలుడి మృతి | The boy was lying dead in the water tank | Sakshi
Sakshi News home page

నీటి తొట్టిలో పడి బాలుడి మృతి

Jan 28 2016 2:14 AM | Updated on Sep 3 2017 4:25 PM

నాలుగు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడి మృతి చెందాడు.

డోర్నకల్ : నాలుగు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడి మృతి చెందాడు. డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామపంచాయతీ పరిధిలోని జర్పులతండాకు చెందిన జాటోత్ లక్ష్మణ్, సత్యవతి దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుదవారం ఉదయం లక్ష్మణ్, సత్యావతి తండా సమీపంలోని మిరపతోటకు కూలి పనులకు వెళ్లగా చిన్న కుమారుడు సాయిరాం(4) తల్లిదండ్రులతో పాటు తోటకు వెళ్లాడు.

తోట ఇంటి పక్కనే ఉండటంతో సాయిరాం తల్లిదండ్రుల కంటే ముందే ఇంటికి చేరుకుని ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలో ఉన్న నీటితొట్టిలో పడిపోయాడు. కొద్ది సేపటికే భోజనం కోసం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కాళ్లు కడుక్కునేందుకు నీటి తొట్టి వద్దకు రాగా సాయిరాం అందులో కనిపించడంతో కంగారు పడి వెంటనే బయటకు తీశారు. అప్పటికే సాయిరాం మృతి చెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement