ఖమ్మం జిల్లాకు చెందిన ఒక బాలుడు డెంగ్యూ జ్వరంతో మృత్యువాతపడ్డాడు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఒక బాలుడు డెంగ్యూ జ్వరంతో మృత్యువాతపడ్డాడు. కొత్తగూడెం సమీపంలోని రుద్రంపూర్ మండలం రామవరం నాగయ్యగడ్డకు చెందిన ఆకుల కృష్ణ కుమారుడు శ్రీరాం(12) స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇరవై రోజులుగా జ్వరంతో బాధపడుతున్న శ్రీరాం బుధవారం రాత్రి ఖమ్మంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందాడు.