మంత్రి ఈటలకు కృతజ్ఞతలు  | Thanks To Minister Eetala | Sakshi
Sakshi News home page

మంత్రికి ఈటలకు కృతజ్ఞతలు 

Mar 27 2018 10:51 AM | Updated on Mar 25 2019 3:09 PM

Thanks To Minister Eetala - Sakshi

మంత్రి నుంచి చెక్కు అందుకుంటున్న చైర్మన్‌ విజయ్‌కుమార్, కమిషనర్‌

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, ఎన్‌ఎంఆర్, ఫిక్స్‌డ్‌ సిబ్బందికి నెలవారీ వేతనం నిమిత్తం ప్రత్యేకంగా రూ.2 కోట్లను గ్రాంట్‌ కింద నిధులు విడుదల చేసిన మంత్రి ఈటల రాజేందర్‌కు మున్సిపాలిటీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. అలాగే హుజూరాబాద్‌ నగరపంచాయతీని మున్సిపాలిటీగా మార్చడానికి కృషి చేసినందుకు రాజేందర్‌ను సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌ మర్యాద పూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గ్రాంట్‌ కింద మంజూరైన నిధుల పత్రాన్ని విజయ్‌కుమార్‌కు అందజేశారు. ఆయన వెంట కమిషనర్‌ జి.స్వరూపారాణీ, మునిసిపల్‌ ఇంజినీర్‌ బి.చంద్రమౌళి, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ రమణారావు, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement