తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేస్తాం: మాయావతి 

In Telangana we will Strengthen BSP Says mayawati - Sakshi

తెలంగాణ ఉద్యమం నా చేతుల్లో ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపేవాణ్ణి 

తెలంగాణ బహుజన జనసేన యుద్ధభేరీలో పవన్‌ వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)ని బలోపేతం చేస్తా మని ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, ఆపార్టీ జాతీ య అధ్యక్షురాలు మాయావతి అన్నారు. గురువారం ఎల్బీస్టేడియంలో తెలంగాణ బహుజన జనసేన యుద్ధభేరీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఎస్పీ ని బలోపేతం చేసే దిశగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులను నిలబెట్టిన ట్లు తెలిపారు. తమది కుటుంబ పాలన కాద ని, నిజమైన సామాజిక న్యాయం కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో నూ అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు.  

చుక్కలు చూపేవాణ్ణి 
మాయావతి ప్రసంగం అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ...తెలంగాణ ఉద్యమం తన చేతుల్లో ఉంటే ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపేవాడిన న్నారు. ఆంధ్రా పాలకులు వేరు ఆంధ్రా ప్రజ లు వేరని తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్‌లాంటి వ్యక్తులకు విన్నవించిన విషయం గుర్తుచేశారు. తెలంగాణ వచ్చినందుకు ఆనందించిన వ్యక్తుల్లో తానే మొట్టమొదటి వ్యక్తినన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుడిని సీఎంని చేస్తామన్న హామీని నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూడటం బాధాకరమన్నారు. గతంలో కేసీఆర్‌ను తిట్టిన తలసాని, ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి వ్యక్తులు నేడు అదేపార్టీలో చేరారని, అలాంటి వ్యక్తులు వారికోసం మాత్రమే పనిచేస్తారు తప్ప ప్రజలకోసం కాదని విమర్శించారు.

మోదీ రాజకీయ నాయకుడిగానే మిగిలిపోయారు 
సరికొత్త పాలకులు తెరమీదికి వచ్చినప్పుడే సాధించుకున్న తెలంగాణకు సార్థకత ఏర్పడుతుందని పవన్‌ అన్నారు. 2014లో చాయ్‌వాలా అంటూ మోదీ ప్రజల ముం దుకు వచ్చినప్పుడు ఆయనలో మార్పును ఆశించానని, ఆయన మాత్రం రాజకీయ నాయకుడిగానే ఉండిపోయాడని తెలిపారు. జీఎస్టీ, నోట్లరద్దు వంటివి ఆందోళన కలిగించాయన్నారు. బహుజనుల సంక్షేమం కోసం పరితపించే మాయావతి లాంటి వ్యక్తి ప్రధా ని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఒక సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించిన మాన్యశ్రీ కాన్షీరామ్‌ అడుగుజాడల్లో నడుస్తున్న వ్యక్తి మాయావతి అని కొనియాడా రు. అనంతరం పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను వేదికపై పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ, జనసేన రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top