‘నిరంతర విద్యుత్‌ కోసం సీఎం కేసీఆర్‌ ముందుచూపు’

Telangana Transco CMD Prabhakar Rao Visits Pulichintala Power Project - Sakshi

సాక్షి, సూర్యాపేట : నిరంతర విద్యుత్‌ విషయంలో సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో వ్యవహరిస్తున్నారని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు స్పష్టం చేశారు. చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. రైతులకు, పరిశ్రమలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విద్యుత్‌ వినియోగించుకునేందుకు గ్రిడ్స్‌ ద్వారా సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. విద్యుత్‌ అధికారులు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, విద్యుత్‌ విషయంలో ఎల్లప్పుడూ ముఖ్యమంత్రికి పూర్తి నివేదిక అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top