పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ | Sakshi
Sakshi News home page

పథకాల అమలులో అగ్రగామిగా తెలంగాణ

Published Tue, Nov 6 2018 2:42 PM

Telangana  Top In Welfare Schemes Implementation - Sakshi

దోమకొండ(నిజామాబాద్‌): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని కామారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంప గోవర్ధన్‌ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని చింతమాన్‌పల్లి, ముత్యంపేట, అంచనూరు, సీతారాంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన స్థానికులనుద్దేశించి ప్రసంగించారు. రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయలేదని చెప్పారు. మిషన్‌ కాకతీయ వల్ల ప్రతి గ్రామంలో చెరువులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. బీడీ కార్మికులు, చేనేత, గౌడ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని తెలిపారు.

తాము అధికారంలోకి రాగానే పింఛన్లను పెంచుతామని, రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. మహా కూటమి మాయ మాటలకు మోసపోవద్దని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజల బాగు కోసం కృషి చేస్తున్నారని, టీఆర్‌ఎస్‌ను మరోమారు గెలిపించి మరింత అభివృద్ధి సాధించుకుందామన్నారు. ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జెడ్పీటీసీ సభ్యుడు మధుసూదన్‌రావ్, పార్టీ మండల అధ్యక్షుడు కుంచాల శేఖర్, నాయకులు ఐరేని నర్సయ్య, నర్సారెడ్డి, తిరుపతిరెడ్డి, మనోహర్‌రెడ్డి, బాల్‌నర్సు, వంగ లలిత, నారాగౌడ్, సాయిరెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement