తుది సమరానికి తొలి అడుగు..  | Telangana Third Phase Panchayat Nomination | Sakshi
Sakshi News home page

తుది సమరానికి తొలి అడుగు.. 

Jan 17 2019 11:46 AM | Updated on Mar 6 2019 8:09 AM

Telangana Third Phase Panchayat Nomination - Sakshi

ఆత్మకూరు(పరకాల): గ్రామ పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్లు జిల్లాలో బుధవారం మొదలయ్యాయి. జిల్లాలో 401 గ్రామపంచాయతీలు ఉండగా ఇందులో మొదటి విడతలో నర్సంపేట, దుగ్గొండి, పర్వతగిరి, వర్ధన్నపేట, సంగెం మండలాల్లో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. వీరి జాబితా ఖరారయ్యింది. బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ పూర్తయ్యింది.

నర్సంపేట మండలంలో 27 గ్రామ పంచాయతీలు, 238 వార్డులు, దుగ్గొండి మండలంలో 34 గ్రామపంచాయతీలు 282 వార్డులు, పర్వతగిరి మండలంలో 33 గ్రామపంచాయతీలు, 288 వార్డులు, వర్ధన్నపేట మండలంలో 18 గ్రామ పంచాయతీలు 170 వార్డులు, సంగెం మండలంలో 33 గ్రామపంచాయతీలు 286 వార్డులు ఉండగా వీటికి ఎన్నికలు మొదటి విడతలో ఈ నెల 21న జరగనున్నాయి.

అలాగే రెండో విడతలో ఈ నెల 25న జరిగే పరకాల మండలంలో 10 గ్రామపంచాయతీలు, 94వార్డులు, నడికుడ మండలంలో 14 గ్రామపంచాయతీలు, 138వార్డులు, శాయంపేట మండలంలో 24 గ్రామపంచాయతీలు 212 వార్డులు, నల్లబెల్లి మండలంలో 29 గ్రామపంచాయతీలు 252 వార్డులు, ఖానాపూర్‌ మండలంలో 20 గ్రామ పంచాయతీలు 178 వార్డులు, రాయపర్తి మండలంలో 39గ్రామపంచాయతీలు 336 వార్డులు ఉన్నాయి. రెండో విడతకు సంబంధించి నేడు ఉపసంహరణలు జరగనున్నాయి.

సర్పంచ్‌కు 36 నామినేషన్లు.. వార్డులకు 58 నామినేషన్లు..
మూడోవిడతలో జరిగే గ్రామపంచాయతీలకు బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మూడో విడత ఎన్నికలు ఈ నెల 30న జరగనున్నాయి. చెన్నారావుపేట మండలంలో 30 గ్రామపంచాయతీలు, 258వార్డులు, నెక్కొండ మండలంలో 39 గ్రామ పంచాయతీలు 340 వార్డులు, ఆత్మకూరు మండలంలో 16 గ్రామపంచాయతీలు152 వార్డులు, దామెర మండలంలో 14 గ్రామ పంచాయతీలు 132 వార్డులు, గీసుకొండ 21 గ్రామపంచాయతీలు 188 వార్డులకుగాను నామినేషన్లను స్వీకరిస్తున్నారు. చెన్నారావుపేటలో సర్పంచ్‌కు 8, వార్డు సభ్యులకు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. నెక్కొండ మండలంలో సర్పంచ్‌కు 9 వార్డు సభ్యులకు 13, ఆత్మకూరు మండలంలో సర్పంచ్‌కు 6, వార్డు సభ్యులకు 12 నామినేషన్లు దాఖలయ్యాయి. గీసుకొండ మండలంలో సర్పంచ్‌కు 5, వార్డు సభ్యులకు 14 నామినేషన్లు దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement