తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్ | telangana tdp mlas arrested | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేల అరెస్ట్

Mar 10 2015 11:12 AM | Updated on Aug 11 2018 6:44 PM

తెలంగాణ అసెంబ్లీ నుంచి నిన్న సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం గన్ పార్క్ వద్ద నిరసనకు..

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి నిన్న సస్పెండ్ అయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంగళవారం గన్ పార్క్ వద్ద నిరసనకు దిగారు. టీడీపీ పట్ల టీఆర్ఎస్ సర్కార్ కక్ష సాధిస్తుందంటూ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. కాగా ఆందోళన చేస్తున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున 144 సెక్షన్ కారణంగా అసెంబ్లీ పరిసరాల్లో ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు వారికి స్పష్టం చేశారు. అరెస్ట్ అయినవారిలో ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డి, సండ్ర వీరయ్య, మాధవరం కృష్ణారావు, గోపీనాథ్, గాంధీమోహన్, రాజేందర్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి తదితరులను అరెస్ట చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు నోటికి నల్ల రిబ్బర్లు కట్టుకుని నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement